05/11/2026, Thursday · 08:33:16 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ.172.27 కోట్లు

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 9:53 AM చిత్తూరు 13

టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ.172.27 కోట్లు
Want this news as a newspaper clip?Print News Clip

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నామి­నేషన్‌ వేసిన మమత శ్రీ, ఆమె కుటుంబ సభ్యుల పేరిట మొత్తం రూ.172.27 కోట్లు ఆస్తి ఉంది. ఈ మేరకు వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇందులో రూ.9.28 కోట్లు చరాస్తి కాగా, రూ.162.99 కోట్లు స్థిరాస్తులు. మమత శ్రీ పేరిట 2 స్కూటీలు, ఆమెకు 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నాయి. ఆమె భర్త మొగిలీశ్వరనాయుడు(ఈశ్వరనాయుడు) పేరిట 3 ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు, 3 కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్కులు ఉన్నాయి.
ఆయన పేరు మీద రూ.119.80 కోట్లు, మమత శ్రీకి రూ.43.64 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇందులో 44.62 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.24.89 కోట్లు విలువైన ఇళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, కర్ణాటకలో ఈ ఆస్తులున్నట్లు తెలిపారు. కాగా, బంగారుపాళ్యం మండలానికి చెందిన ఆమె.. గుడిపాల నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున నామినేషన్‌ వేశారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Assets Rs172TDPZPTCCandidateCrores

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News