05/11/2026, Thursday · 07:21:03 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 7:36 AM భక్తి 20

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Want this news as a newspaper clip?Print News Clip

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్‌ వేసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. అందరితోనూ కలుపుగోలుగా మెలుగుతారు. బంధుత్వాలు బలపడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. కొన్ని విషయాలు పట్టించు కోవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. అవకాశాలు కలిసివస్తాయి. కొత్తయత్నాలు చేపడతారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట పడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు పురమాయించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. గృహం సందడిగా ఉంటుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవు తాయి. ప్రముఖులకు చేరువవుతారు. వ్యతిరే కులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. శుభకార్యానికి హాజరవుతారు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఆదాయా నికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. . కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వొద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కార్యసిద్థి, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

పరిస్థితులు క్రమంగా మెరుగు పడతాయి. కార్యానుకూలత ఉంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా నిల దొక్కుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్య త్వం స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవు తాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. అందరితోనూ కలుపుగోలుగా మెలగండి. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పుణ్యక్షేత్రాలకు సన్నాహాలు సాగిస్తారు.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా వ్యవ హరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఫోన్‌ సందే శాలు పట్టించుకోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దూరపు బంధువుల శుభలేఖ ఆశ్చర్యం కలిగిస్తుంది. పిల్లల దూకుడు అదుపు చేయండి.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృథాకాదు. లక్ష్యానికి చేరువవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అప్రియమైన వార్త వింటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమ అధికం, ఫలితం స్వల్పం. ఆచితూచి అడుగేయాలి. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయినవారే వెనకడుగు వేస్తారు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆప్తులతో సంభాషణ ఉప శమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు చేపడ తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చు కోండి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

అన్ని విధాలా బాగుంటుంది. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్‌ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో చెల్లిం పులు జరుపుతారు. పనులు వేగవంతమవు తాయి. అందరితోనూ మితంగా సంభాషిం చండి. మీ నుంచి విషయేసకరణకు కొందరు యత్నిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

మీదైన రంగంలో నిలదొక్కుకుం టారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పలు కుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడ తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భా టాలకు వ్యయం చేస్తారు. పనులు త్వరితగ తిన సాగుతాయి. కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం. కొత్త పనులు చేపడతారు. వ్యాపకాలు అధిక మవుతాయి. మనోధైర్యంతో అడుగు ముందు కేస్తారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. పోయాయను కున్న వస్తువులు లభ్యమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Weekly resultshoroscope

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News