05/11/2026, Thursday · 08:34:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తుఫాన్ హెచ్చరికలతో దుర్గగుడి అధికారుల అప్రమత్తం.. ఘాట్ రోడ్డులో ఈవో తనిఖీలు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 4:29 PM ఎన్.టి.ఆర్. 15

తుఫాన్ హెచ్చరికలతో దుర్గగుడి అధికారుల అప్రమత్తం.. ఘాట్ రోడ్డులో ఈవో తనిఖీలు
Want this news as a newspaper clip?Print News Clip

విజయవాడ : తుఫాన్, భారీ వర్షాల హెచ్చరికలతో దుర్గగుడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కీలక ప్రాంతాలను ఈవో వి.కె.శీనా నాయక్ పరిశీలించారు. ఓం టర్నింగ్, ఘాట్ రోడ్డు, టోల్ గేట్ వద్ద క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. కొండపై నుంచి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ మార్గాలను పరిశీలించారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో కొండచరియలు జారిపడిన సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.భారీ వర్షాలకు రాళ్లు జారిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. కనకదుర్గ నగర్ మార్గంలో భక్తుల రాకపోకలను పరిశీలించారు. వర్షాల వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ప్రత్యామ్నాయ జనరేటర్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చలి, వర్షాల నేపథ్యంలో భక్తులకు నిరంతరాయంగా వేడి అన్నప్రసాదం అందించాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. భక్తుల భద్రతే లక్ష్యంగా దుర్గగుడి యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Officials AlertCycloneAlertsDurgagudiChecksGhatRoad

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News