05/11/2026, Thursday · 08:34:49 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి 40 ఏళ్లు.. వైద్య విద్యలో ఏఐ, పరిశోధనలకు గవర్నర్ పిలుపు

భవ్య జర్నలిస్ట్ 26/10/2026 1:18 PM ఎన్.టి.ఆర్. 7

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి 40 ఏళ్లు.. వైద్య విద్యలో ఏఐ, పరిశోధనలకు గవర్నర్ పిలుపు
Want this news as a newspaper clip?Print News Clip

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశంలోనే తొలి ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి గుర్తింపు ఉందన్నారు. 1986లో ఎన్టీఆర్ దార్శనికతతో ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని స్థాపించారన్నారు. విద్యా రంగంలో ఎన్టీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆధునిక వైద్యం నుంచి నర్సింగ్, దంత వైద్యం వరకు విద్యా విభాగాలు విస్తరించాయని తెలిపారు.మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య విద్యలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని గవర్నర్ చెప్పుకొచ్చారు. వైద్య విద్యలో కృత్రిమ మేధస్సు, డిజిటల్ అభ్యసనానికి ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, సానుభూతి, టీమ్‌వర్క్ అవసరమన్నారు. వైద్య విద్య, శిక్షణ జీవితాంతం కొనసాగాల్సిన ప్రక్రియలని చెప్పుకొచ్చారు. విద్యా ప్రమాణాలు, పారదర్శక పరిపాలన, నిష్పక్షపాత పరీక్షలకు ప్రాధాన్యమన్నారు. విద్యార్థుల ప్రతిభ, నాణ్యతే విశ్వవిద్యాలయానికి నిజమైన బలమని వ్యాఖ్యానించారు. వైద్య వృత్తిలో నైతిక విలువలు, రోగుల గోప్యత, మానవీయ దృక్పథం కీలకమని తెలిపారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సేవలు ప్రశంసనీయమని గవర్నర్ కొనియాడారు. వైద్య విద్యతో పాటు పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, మెరుగైన క్లినికల్ శిక్షణకు ప్రాధాన్యమన్నారు. అనుబంధ కళాశాలలు, ప్రభుత్వంతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. యువ పరిశోధకులను ప్రోత్సహిస్తూ పరిశోధనా సహకారాన్ని విస్తరించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి విశ్వవిద్యాలయం కృషి చేయాల, రాబోయే దశాబ్దాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కుటుంబానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Governor callsyearsNTRHealthUniversityresearchmedicaleducation

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News