05/11/2026, Thursday · 08:58:46 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు: మంత్రి శ్రీహరి

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 4:53 PM హైదరాబాద్ 9

డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు: మంత్రి శ్రీహరి
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్  తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి (Telangana Minister Vakiti Srihari) వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఖేలో ఇండియా నిర్వహణను తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని వెల్లడించారు.

గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తాం

గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 27 క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా క్రీడాకారుల ఎంపిక చేస్తామని వివరించారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోషకాహారం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని మార్గనిర్దేశం చేశారు. స్టేడియాలు, క్రీడా పరికరాలు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.క్రీడాకారులకు వైద్య సహాయం, వసతి, రవాణా సదుపాయాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. దేశానికే ఆదర్శంగా ఖేలో ఇండియా పోటీల నిర్వహణ ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

India CompetitionsKheloTelanganaDecemberMinisterSrihari

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News