05/11/2026, Thursday · 07:21:20 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

శ్రీలంకను తక్కువగా అంచనా వేయొద్దు.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టండి: గంభీర్

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 1:41 PM అంతర్జాతీయం 13

శ్రీలంకను తక్కువగా అంచనా వేయొద్దు.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టండి: గంభీర్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పలు కీలక సూచనలు చేశాడు. డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. డిసెంబర్ 13 నుంచి మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచి సిద్ధం కావాలని ప్లేయర్లకు గంభీర్ సూచించాడు. నెల రోజుల విరామం ఉన్నప్పటికీ సమయం వృథా చేసుకోకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని చెప్పాడు.‘న్యూజిలాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. మీరు తలెత్తుకుని స్వదేశానికి వెళ్లొచ్చు. చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలని అనుకున్నాం. కానీ కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. మనం ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడటం లేదు. ఇప్పుడు నెల రోజుల విరామం ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి. శ్రీలంక సిరీస్ కోసం బాగా సిద్ధం కావాలి. ఏ ప్రత్యర్థినీ తక్కువ అంచనా వేయకూడదు. జట్టుగా నిరంతరం ఎదుగుతూ ఉండాలి. జట్టుగా ఆలోచించాలి. జట్టుగానే ఆడాలి. విజయాలు అవే వస్తాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఫిట్‌నెస్‌ను కాపాడుకోండి’ అని గంభీర్ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Lanka focusDonunderestimateSrifitnessGambhir

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News