05/11/2026, Thursday · 07:21:46 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అమెరికా హాలోవీన్ వేడుకల్లో ఘోర హింసాకాండ.. పలు చోట్ల సామూహిక కాల్పులు

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 10:11 AM అంతర్జాతీయం 15

అమెరికా హాలోవీన్ వేడుకల్లో ఘోర హింసాకాండ.. పలు చోట్ల సామూహిక కాల్పులు
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నైట్‌క్లబ్స్, హాలోవీన్ పార్టీ జరిగిన ప్రదేశాల్లో, హాలోవీన్ దుకాణాల్లో దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సామూహిక కాల్పులు చోటుచేసున్నాయి. కాగా.. ఈ దాడులకు ఒకదానితో మరో దానికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అమెరికాలోని డల్లాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడాలోని పలు ప్రాంతాలతో పాటు బర్మింగ్‌హామ్, బ్లూమింగ్టన్, ఫేయెట్విల్లే‌ సమీపంలోని పలు యూనివర్శిటీ ప్రాంగణాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మ్యూజిక్, రెస్టారెంట్లు, నైట్‌లైఫ్‌కు పేరుపొందిన ‘డీప్ ఎల్లమ్’ ప్రాంతంలో శనివారం జరిగిన వేర్వేరు కాల్పుల్లో నలుగురు మరణించగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిగిన కాల్పుల్లో.. ఇదే అత్యంత హింసాత్మక ఘటన అని పేర్కొన్నారు.

బర్మింగ్‌హామ్‌లోని అలబామాలో శనివారం రాత్రి ఫుట్‌బాల్ గేమ్ నిర్వహించగా.. ఆట పూర్తైన అనంతరం రెండు చోట్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారని వెల్లడించారు. ఈ ఆటకు దాదాపు 70,000 మంది అభిమానులు హాజరయ్యారని, ఆట ముగిసిన వెంటనే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోవడం వల్ల ప్రాణనష్టం తగ్గిందని తెలిపారు.

ఆర్కాన్సాస్‌లోని ఫాయెట్‌విల్లే.. అలబామాలోని బర్మింగ్‌హామ్.. డెలావేర్‌లోని నెవార్క్.. ఇల్లినాయిస్‌లోని బ్లూమింగ్‌టన్ కళాశాలల ప్రాంగణాలలో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 19 ఏళ్ల యువతి మరణించగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని.. గాయపడిన 12 మందిని హాస్పిటల్‌లో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. గంట వ్యవధిలోనే ఈ కళాశాలల్లో కాల్పులు జరిగాయని.. ఈ కాల్పుల్లో ఒకదానితో మరోదానికి సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

గ్రేమాంట్ అవెన్యూ వెంబడి వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలపై కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని.. అతని వద్ద పలు ఆయుధాలు లభించాయని పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని ఓ దుకాణంలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో.. 31 ఏళ్ల గర్భవతి మరణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. కాలిఫోర్నియా, మిచిగాన్ ప్రాంతాల్లోని హాలోవీన్ దుకాణాలపై శుక్రవారం కాల్పులు జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల్లో.. ప్రజలు సంఘటనా స్థలం నుంచి ప్రాణరక్షణ కోసం పరుగెత్తడం కనిపించిందని.. కాల్పుల ఘటన తర్వాత నగరంలోని మెయిన్ స్ట్రీట్‌ను చాలా గంటల పాటు మూసివేశారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌కు బానిసలవ్వడం, ఆయుధాలు సులభంగా అందుబాటులో ఉండడం వల్ల చిన్న గొడవలకే కాల్పులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.. కాగా కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Mass shootingsHalloweencelebrations

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News