కాకినాడ జిల్లాలో కూటమి హవా.. 1వ రౌండ్ పూర్తయ్యేసరికి 4 స్థానాల్లో విజయం

కాకినాడ : జిల్లాలోని గొల్లప్రోలులో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి.. కూటమి అభ్యర్థుల్లో టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 1 స్థానంలో విజయం సాధించింది. 6 వార్డులకు గాను.. 4 వార్డుల్లో కూటమి గెలుపొందగా.. మిగిలిన 2 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.23 వార్డులకు గాను మొదటి రౌండ్‌లో ఆరు వార్డుల లెక్కింపు పూర్తి కాగా.. టీడీపీ 3, జనసేన 1, స్వతంత్ర అభ్యర్థులు 2 వార్డుల్లో విజయం సాధించారు. 1వ వార్డులో జనసేన అభ్యర్థి వెన్నా ముత్యాలమ్మ.. వైసీపీ ప్రత్యర్థిపై 432 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి మురదా నవీన్.. వైసీపీ ప్రత్యర్థిపై 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 9వ వార్డులో టీడీపీ అభ్యర్థి సింగం ప్రవీణ్ మణి.. వైసీపీ అభ్యర్థిపై 262 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
13వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి వీర్ల అరుణ.. బీజేపీ ప్రత్యర్థిపై 459 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. 17వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గున్నాబత్తుల రాంబాబు(జనసేన రెబల్).. జనసేన ప్రత్యర్థిపై.. 345 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి పర్వత సూర్యనారాయణ.. వైసీపీ ప్రత్యర్థిపై 515 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా.. రెండవ రౌండ్ లెక్కింపు కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












