05/11/2026, Thursday · 07:21:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

Title: గొల్లప్రోలులో జనసేన జయభేరి

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 5:29 PM కాకినాడ 6

Title: గొల్లప్రోలులో జనసేన జయభేరి
Want this news as a newspaper clip?Print News Clip
  • గొల్లప్రోలు మున్సిపల్ పీఠం జనసేన కైవసం
  • చైర్‌పర్సన్‌గా కడారి తమ్మయ్య నాయుడు విజయం
  • వైసీపీ అభ్యర్థిపై 8,437 ఓట్ల భారీ మెజారిటీ

గ్లోబల్ వార్త, గొల్లప్రోలు : గొల్లప్రోలు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి కడారి తమ్మయ్య నాయుడు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి చెక్కపల్లి నాగేశ్వరరావుపై 8,437 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో గొల్లప్రోలు మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని జనసేన పార్టీ దక్కించుకుంది. ఓట్ల లెక్కింపులో కడారి తమ్మయ్య నాయుడుకు 11,757 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెక్కపల్లి నాగేశ్వరరావుకు 3,320 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి గారపాటి సుబ్బారావుకు 66 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి కస్సా వెంకటేశ్వరరావుకు 282 ఓట్లు వచ్చాయి. నోటాకు 129 ఓట్లు నమోదయ్యాయి. మరో 472 ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. గొల్లప్రోలు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడారి తమ్మయ్య నాయుడు విజయం సాధించడంతో జనసేన నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది. ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 8,437 ఓట్ల మెజారిటీతో విజయం నమోదు కావడంతో గొల్లప్రోలు మున్సిపల్ రాజకీయాల్లో ఈ ఫలితం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Sena JayabheriTitleJanaGollaprolu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News