05/11/2026, Thursday · 08:58:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

20 మార్కెట్లు, 20 వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 11:56 AM జాతీయం 18

20 మార్కెట్లు, 20 వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
Want this news as a newspaper clip?Print News Clip

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ వ్యాపారుల సంఘం చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) వినూత్న విజ్ఞప్తి చేసింది. వచ్చే నెల 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తమ వ్యాపారాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని రాహుల్ గాంధీకి సీటీఐ విజ్ఞప్తి చేసింది. ‘మీ (ఇండియా కూటమి) ర్యాలీ వల్ల రామ్ లీలా మైదాన ప్రాంతంలో మరింత మంది కస్టమర్లు వస్తారని, మరింత వ్యాపారం జరుగుతుందని మాకు హామీ ఇవ్వండి. అలాంటి వాతావరణంలో మాకు ఇబ్బంది లేదు. అయితే, ర్యాలీ వల్ల మా వ్యాపారాలకు నష్టం కలిగేటట్లుంటే కనీసం దీపావళి వరకు ర్యాలీని వాయిదా వేయండి’ అని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్.. రాహుల్‌కు లేఖ రాశారు.

20 మార్కెట్లు.. ఒక డిమాండ్

దీపావళి నేపథ్యంలో వచ్చే నెల 1న రామ్ లీలా మైదానంలో ర్యాలీ నిర్వహిస్తే, తమ వ్యాపారంపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కూడా ఆరోజు ర్యాలీ జరుగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీటీఐ ఆయనకు విజ్ఞప్తి చేసింది. ‘ప్రతిఒక్కరూ చెప్పేది వింటా అని మీరు (రాహుల్) అన్నారు. మేము 20 మార్కెట్లకు చెందిన 20 మంది వ్యాపారులం. 20 నిమిషాలు మాత్రమే అడుగుతున్నాం. ఇండియా కూటమి ర్యాలీ వల్ల ప్రభావం పడే మార్కెట్లన్నీ రామ్ లీలా మైదాన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి’ అని సీటీఐ తెలిపింది. ఈ సందర్భంగా రాహుల్ నినాదం ‘మొహబ్బత్ కీ దుకాన్’ ను సీటీఐ ప్రస్తావించింది. ‘రాహుల్ జీ.. ద్వేషం అనే మార్కెట్లో ప్రేమ అనే దుకాణాన్ని మీరు తెరిచారు. అందుకు మేము మిమ్మల్ని గౌరవిస్తాం. అయితే, దీపావళి సమయంలో మా దుకాణాలు మూతపడేలా చేయకండి’ అని సీటీఐ పేర్కొంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Traders AppealMarketsMinutesDelhiRahul

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News