05/11/2026, Thursday · 08:58:43 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీస్ కమిషనర్‌ తొలగింపు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 1:59 PM జాతీయం 17

హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీస్ కమిషనర్‌ తొలగింపు
Want this news as a newspaper clip?Print News Clip

హిట్ అండ్ రన్ కేసులో కొచ్చి పోలీస్ కమిషనర్ కలిరాజ్ మహేశ్‌కు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ కేసులో కలిరాజ్‌ను పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆ కేసు దర్యాప్తు విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కలిరాజ్ స్థానంలో ఆర్.నిశాంతిని నియమించింది. అదనపు జిల్లా జడ్జి కుమారుడు (17) మెర్సిడెస్ బెంజ్ కారు నడుపుతూ స్కూటీని ఢీకొట్టడంతో జయబాలకృష్ణన్ (55) అనే వ్యక్తి చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కేసును నీరుగార్చేందుకు కుట్ర జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.యువకుడు తరచూ కారు నడుపుతాడని, ప్రమాదం జరిగిన రోజు రాత్రి కూడా వేగంగా కారు నడిపాడని బాధితులు పేర్కొన్నారు. కారు నడుపుతూ రీల్‌ తీస్తున్నాడని చెప్పారు. కాగా.. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు అత్యధిక వేగంతో కారు నడుపుతున్న వీడియోను పోలీసులు అతడి ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ వీడియోను బాలుడి ఫోన్ నుంచి తొలగించేందుకు అతడి తండ్రి ప్రయత్నించారని తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. నిందితుడి తండ్రి తన పలుకుబడిని ఉపయోగించి కేసును బలహీనపరిచేందుకు ప్రయత్నించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో కలిరాజ్‌పై ప్రభుత్వం వేటు వేసింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

kamishanar tolagimpuhitamdrankesukochchipolis

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News