05/11/2026, Thursday · 08:33:19 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఓటమి భయంతోనే వైసీపీ నేతల డ్రామాలు

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 8:37 PM శ్రీ సత్యసాయి 6

ఓటమి భయంతోనే వైసీపీ నేతల  డ్రామాలు
Want this news as a newspaper clip?Print News Clip

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను గొప్పగా చెప్పుకున్న జగన్.. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లించడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.గతంలో స్థానిక ఎన్నికల్లో 82 శాతం స్థానాలను గెలుచుకున్నామని చెప్పుకున్న జగన్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 94 శాతం స్థానాల్లో ఎందుకు ఓటమి పాలయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఏకగ్రీవాలు.. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆధారాలతో మాట్లాడే ధైర్యం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రెస్‌మీట్‌లో చిరునవ్వులు చిందించడం ఆయన వైఖరికి నిదర్శనమని విమర్శించారు.ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పులతడకగా నామినేషన్లు వేసి డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి రౌడీలు, బౌన్సర్లు, మారణాయుధాలను ఎందుకు రప్పించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం మేయర్ స్థానాన్ని బీజేపీకి కేటాయించగానే వైసీపీ ముస్లిం అభ్యర్థిని జగన్ ఎందుకు మార్చారని ప్రశ్నించారు. గతంలో ప్రజల ఆస్తులను లాక్కోవాలని చూసిన జగన్.. ఇప్పుడు ఆస్తుల రక్షణ గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి సత్యకుమార్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

dramas outYCPleadersfeardefeat

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News