05/11/2026, Thursday · 04:16:24 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వేధింపులు.. మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 3:39 PM రాష్ట్ర వార్తలు 1

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వేధింపులు.. మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం
Want this news as a newspaper clip?Print News Clip

పార్వతీపురం మన్యం : కొఠియా గ్రూప్ గ్రామాలలో ఒరిస్సా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఓటేయటానికి వెళుతున్న గిరిజనులకు వేధింపులకు గురిచేస్తున్నారు. ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు సమస్య ఉన్న కొఠియా గ్రామాలలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోఠియా 29 గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసులు ఆగడాలు ఎక్కవైపోయాయన్నారు. గిరిజనులపై బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు వద్దనుకుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని.. గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

అమాయక గిరిజనులపై ప్రతాపం చూపిస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దును భారత్-పాకిస్థాన్ సరిహద్దులా మార్చొద్దన్నారు. గిరిజనుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కోఠియా గ్రామాలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే హంగామా

పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అలజడి సృష్టించారు. బలిజిపేట మండలం చిలకలపల్లిలో తన అనుచరులతో కలసి ఓటేయానికి వెళుతూ హంగామా చేశారు. పోలింగ్ బూత్ దగ్గరకు గుంపుగా వెళుతున్న జోగారావు, అనుచరులను వీడియో తీస్తున్న వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే నెట్టివేశారు. జోగారావు తీరుపట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

expresses outrageOdishaPoliceharassmentKothiavillagesMinisterSandhya

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

786 Posts

Latest News

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం.. 40 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్.. కర్నూలు జిల్లా కడిమెట్లలో ఆసక్తికర పోరు అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా మైక్రోసాఫ్ట్, గూగుల్ తరువాత మెటా.. ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఎస్ఎస్ఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల ‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్.. గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సందడి.. గాంధీభవన్‌లో సమావేశానికి దామోదర డుమ్మా.. వెనుదిరిగిన మహేశ్ గౌడ్ అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం: మల్కాజ్‌గిరి సీపీ సుమతి