05/11/2026, Thursday · 04:16:23 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 3:36 PM హైదరాబాద్ 1

అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi) స్పష్టం చేశారు. నిందితుల దగ్గర హార్మోన్ల ఇంజక్షన్స్ గుర్తించామని, కానీ మహిళలకు వాటిని ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియదని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ కేసు గురించి కీలక విషయాలను మీడియాకు సీపీ సుమతీ ఈరోజు

 వెల్లడించారు.అండాల డొనేషన్ కోసం ఏఆర్టీ సెంటర్ ద్వారానే ఫెర్టిలిటి సెంటర్‌కు సమాచారం వస్తుందని సీపీ సుమతీ చెప్పుకొచ్చారు. ఏఆర్‌టీ నుంచి అన్నిరకాల డాక్యుమెంట్‌లు సేకరించిన తర్వాత మిగతా ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో మూడు ఆస్పత్రుల పాత్ర ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మూడు ఫెర్టిలిటి సెంటర్‌లపై సోదాలు చేశామని చెప్పారు. 22 ఫెర్టిలిటీ సెంటర్‌లతో ఏఆర్‌టీ సెంటర్‌లకు లింకులు ఉన్నాయని.. వీటి గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు. మహిళలకు పెళ్లి కాకపోయినా జరిగినట్లుగా, భర్త లేకున్నా ఉన్నట్లుగా చెప్పి అండాలను సేకరించారని సీపీ సుమతీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Collection CaseIllegalEggFertilityCentresEnquiredPolice

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

786 Posts

Latest News

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం.. 40 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్.. కర్నూలు జిల్లా కడిమెట్లలో ఆసక్తికర పోరు కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వేధింపులు.. మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం మైక్రోసాఫ్ట్, గూగుల్ తరువాత మెటా.. ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఎస్ఎస్ఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల ‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్.. గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సందడి.. గాంధీభవన్‌లో సమావేశానికి దామోదర డుమ్మా.. వెనుదిరిగిన మహేశ్ గౌడ్ అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం: మల్కాజ్‌గిరి సీపీ సుమతి