05/11/2026, Thursday · 04:16:25 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

40 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్.. కర్నూలు జిల్లా కడిమెట్లలో ఆసక్తికర పోరు

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 4:08 PM కర్నూలు 1

40 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్.. కర్నూలు జిల్లా కడిమెట్లలో ఆసక్తికర పోరు
Want this news as a newspaper clip?Print News Clip

కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడింది. తొలిసారిగా పోటీ వాతావరణంలో ఎన్నికలు జరగడంతో రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో స్థానికంగా రాజకీయాలు వేడెక్కాయి.ఎర్రకోట, కడిమెట్ల గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. నాలుగు దశాబ్దాల ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి తెరపడటంతో ఈసారి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

ఇదీ చదవండి :: పోలీసులతో ఎంపీ అవినాష్ రెడ్డి వాగ్వాదం.. పార్నపల్లిలో హైటెన్షన్

Interesting fightBrakeyearsunanimoustraditionKurnoolDistrictKadimet

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

786 Posts

Latest News

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం.. కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వేధింపులు.. మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా మైక్రోసాఫ్ట్, గూగుల్ తరువాత మెటా.. ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఎస్ఎస్ఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల ‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్.. గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సందడి.. గాంధీభవన్‌లో సమావేశానికి దామోదర డుమ్మా.. వెనుదిరిగిన మహేశ్ గౌడ్ అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం: మల్కాజ్‌గిరి సీపీ సుమతి