కడప మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం

కడప : ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పలు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. బద్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. రాజంపేట మున్సిపాలిటీలోనూ టీడీపీ విజయం సాధించి మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. రాయచోటిలో మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలోనూ టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.ఇక ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ గెలుపొందినట్లైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో విజయం సాధించిన అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












