05/11/2026, Thursday · 03:14:38 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సందడి..

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 3:06 PM నిజామాబాద్ 1

గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సందడి..
Want this news as a newspaper clip?Print News Clip
  • ఒక్కో దండారీకి రూ.15వేలు మంజూరు

కెరమెరి(ఆదిలాబాద్): గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సందడి ప్రారంభమైంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే దండారీ ఉత్సవాలు ప్రారంభమయ్యా యి. కుమరం భీం జిల్లాలో 50 గూడెల్లో గుస్సాడి, దండారీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఒక్కో దండారీకి రూ.15వేలు ప్రకటించింది. ఆదివారం నుంచి కొన్ని చోట్ల ఉత్సవాలు ప్రారంభం కాగా మరో కొన్ని రోజుల్లో దండారీలు నిర్వహించే ప్రతి గ్రామంలో గుస్సాడీ ఉత్స వాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో దండారీ సమూహాలుగా చేరి నృత్యాలు ప్రదర్శిస్తారు. నెమలి ఈకలు పొదిగిన టోపీ, తలపాగా కృతిమ మీసాలు, గడ్డలు, జింక లేదా మేక చర్మాన్ని ధరిస్తారు. డప్పులతో పాటు పేప్రే, తుడుం, కాలికోం తదితర వాయిద్యాలను వినియోగిస్తారు.

భోగితో ప్రారంభమై..

గిరిజనుల దండారీ ప్రారంభించ రోజు భోగి పండుగగా పరిగణిస్తారు. గత పక్షం రోజుల క్రితం ప్రారంభమై కోలబోడికి దం డారీలు దీపావళి పండుగ తర్వాత కోలబోడి ఉత్సవాలతో ము గిస్తారు. గుస్సాడీ, దండారీ ఏ గ్రామంలో ఉంటుందో ఆ గ్రామంలో వారు భోగి పండుగ నిర్వహిస్తారు. అదే రోజు నుంచి గుస్సాడీ నృత్యాలు ప్రారంభమవు తాయి. దండారీల్లో అనేక రకాలున్నాయి. బేటికోలా, మానుకోల, సదర్‌ కోలా, కోడల్‌కోలా, కలివల్‌కోలా వంటి అనేక రకాలు ఉండగా వాటిలో కోలలతో మ హిళలు, పురుషులు దండారీ నృత్యాలు చేస్తారు. చివరి రోజు కోలబోడి చేస్తారు. ఆ రోజు గ్రామస్తులు, పెద్దలు గ్రామ శివా రులోని ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఆభరణాలు ఓ చెట్టుకు కట్టేసి హారతి ఇస్తారు.

నెమలి టోపీలే ప్రత్యేకం..

నెమలి పింఛం టోపీల తయారీకి మండలంలోని పాటగూడ గ్రామం ప్రసిద్ది చెందింది. గడిచిన పాతికేళ్ల నుంచి ఈ గ్రామ స్తులు నెమలి టోపీలు తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా లోని ఉట్నూరు, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూరు, సిర్పూరు(యు), కెరమెరి, తిర్యాణి, వాంకిడి తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడి నుంచి నెమలి టోపీలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటాతరు. గ్రామస్థులు నెల రోజుల క్రితమే టోపీల తయారీ పనులు ప్రారంభించారు. ఒక్కో నెమలి పింఛం టోపీ ఖరీదు రూ.10వేల వరకు ఉంటుంది. గుస్సాడీ ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆయా గ్రామాల్లో దండారీ ఉత్సావాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నిష్టతో వేడుకలు..

ఆనంద్‌రావు, సర్పంచ్‌, గోయగాం

దండారీ పండుగ ఎంతో నిష్టతో జరుపుకుంటాం. భోగి నుంచి కొలబోడి వరకు ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి. గిరిజన గ్రామాల్లో అంతా సందడి ఉంటుంది. గ్రామస్తులంతా ఒకే చోటచేరి ఉల్లాసంగా గడుపుతాం

ఆచారాలను కాపాడుకోవాలి..

మడావి శాంతబాయి, కొఠారి సర్పంచ్‌

ఆచారాలను కాపాడుకోవాలి. ప్రస్తుతం మారు తున్న సమాజంలో కొత్త పోకడలు వస్తున్నాయి. కానీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని అంతా కాపా డుకోవాలి. ఇందుకు యువత తమ వంతు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆచారాలు కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. దండారీ పండుగ భక్తిశ్రద్ధలతో కలిసికట్టుగా జరుపుకుంటాం.

తరాలుగా ఆచారంగా..

భీంరావు, రాంజీగూడ గ్రామస్తుడు

తరాలుగా వస్తున్న ఆచారం దండారీ పండుగ. ఈ పండుగతో గిరిగ్రామాల్లో ప్రత్యేక సందడి ఉం టుంది. తాతా ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం నేటి కి కాపాడుకుంటూ వస్తున్నాం. ఆదివాసీల సంస్కృతి, సంప్ర దాయాలు గుస్సాడీ ఉత్సవాలతో బయటి ప్రపంచానికి తెలుస్తాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Gussadi BustleTribalVillages

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

779 Posts

Latest News

‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్.. గాంధీభవన్‌లో సమావేశానికి దామోదర డుమ్మా.. వెనుదిరిగిన మహేశ్ గౌడ్ అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం: మల్కాజ్‌గిరి సీపీ సుమతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త భార్య అయ్యవారమ్మ గారు నివాళులు అర్పించి వరదరాజుల రెడ్డి గారు పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ సందడి. రాప్తాడు బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం: మంత్రి సత్యకుమార్ యాదవ్ సీసీ కెమెరాలు ఆఫ్‌.. పెట్రోల్‌ బాంబుల దాడులు గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు? ప్రజలు నమ్మారు.. గెలిపించారు