05/11/2026, Thursday · 02:17:36 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రజలు నమ్మారు.. గెలిపించారు

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 1:51 PM రాష్ట్ర వార్తలు 1

ప్రజలు నమ్మారు.. గెలిపించారు
Want this news as a newspaper clip?Print News Clip

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉయ్యూరును అభివృద్ధి పథంలో నడిపించాలి

నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన

ఉయ్యూరు పట్టణంలో కూటమి పార్టీల విజయోత్సవాలు.. ప్రజలకు కృతజ్ఞతలు

ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ నూతనంగా ఎన్నికైన చైర్మన్, కౌన్సిలర్లకు సూచించారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు సోమవారం ఉయ్యూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఉయ్యూరు పట్టణ ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి, అత్యధిక మెజార్టీతో 29 మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌ను గెలిపించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ చేసిన దుష్ప్రచారాలను ప్రజలు నమ్మకుండా కూటమి అభ్యర్థులకు భారీ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నూతన చైర్మన్, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేసి ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని సూచించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఉయ్యూరు సెంటర్ వరకు నాయకులు, నూతన పాలకవర్గ సభ్యులు పాదయాత్రగా వెళ్లి పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, నూతనంగా ఎన్నికైన చైర్మన్, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

believed wonPeople

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

773 Posts

Latest News

రాప్తాడు బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం: మంత్రి సత్యకుమార్ యాదవ్ సీసీ కెమెరాలు ఆఫ్‌.. పెట్రోల్‌ బాంబుల దాడులు గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు? హోదా పక్కన.. ప్రజాస్వామ్యమే ముందు అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి డిమాండ్ ఫుల్.. ధర నిల్ అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్ వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు తిరుపతి లడ్డూ కేసు.. ఇతర రాష్ట్రాలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో