05/11/2026, Thursday · 02:17:37 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హోదా పక్కన.. ప్రజాస్వామ్యమే ముందు

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 1:45 PM శ్రీకాకుళం 1

హోదా పక్కన.. ప్రజాస్వామ్యమే ముందు
Want this news as a newspaper clip?Print News Clip
  • కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న అచ్చెన్నాయుడు
  • ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే.. ఓటు వేయడం పౌర బాధ్యత: మంత్రి

గ్లోబల్ వార్త- శ్రీకాకుళం: మంత్రి హోదా.. అధికార వైభవం.. ఇవేవీ పోలింగ్ కేంద్రం వద్ద కనిపించలేదు. ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో తాను కూడా ఓ సామాన్య పౌరుడినేనని చాటుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారు. తన అధికార హోదాను పక్కనపెట్టి ఇతర ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనన్న సందేశాన్ని ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి కింజరాపు విజయమాధవి, కుమారుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు, సోదరుడు హరివరప్రసాద్ కూడా ఓటు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎలాంటి ప్రత్యేక హంగులు, హడావుడి లేకుండా సాధారణ ఓటర్ల మాదిరిగా క్యూలో నిలబడి తన వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. ఓటు వేసిన అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు ఓటు అని, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఒక్క ఓటు కూడా సమాజ భవిష్యత్తును ప్రభావితం చేయగలదని స్పష్టం చేశారు.ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం కేవలం రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదని, సమాజం పట్ల ప్రతి పౌరుడికీ ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఆకాంక్షించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు ఓటు ప్రాధాన్యతను చాటిచెప్పారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

status democracyNext

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

773 Posts

Latest News

రాప్తాడు బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం: మంత్రి సత్యకుమార్ యాదవ్ సీసీ కెమెరాలు ఆఫ్‌.. పెట్రోల్‌ బాంబుల దాడులు గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు? ప్రజలు నమ్మారు.. గెలిపించారు అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి డిమాండ్ ఫుల్.. ధర నిల్ అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్ వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు తిరుపతి లడ్డూ కేసు.. ఇతర రాష్ట్రాలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో