05/11/2026, Thursday · 02:17:37 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 1:34 PM అనంతపురము 1

అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి
Want this news as a newspaper clip?Print News Clip

అనంతపురం : ఏపీలో పరిషత్ ఎన్నికలు కొనసాగుతుండగా.. పలు చోట్ల వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైసీపీ మూకల దాడులపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ గొడ్డలిపార్టీ శ్రేణులు రెచ్చిపోయారు. జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాలబండ్ల శ్రీరాములు గ్రామంలోకి అడుగుపెట్టగానే వైసీపీ నేతలు అడ్డుకున్నారు.వైసీపీ నేతలు అడ్డుకోవడంతో మొదలైన గొడవ... ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలేపల్లిలో యథావిధిగా పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ అల్లరి మూకల దాడిలో టీడీపీ అభ్యర్థి సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతర్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థి చెన్నకేశవ సోదరుడిపై వైసీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో గాయపడిన మల్లిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ సృష్టిస్తున్న అల్లర్లపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

election AttackClashesAnantapurParishad

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

773 Posts

Latest News

రాప్తాడు బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం: మంత్రి సత్యకుమార్ యాదవ్ సీసీ కెమెరాలు ఆఫ్‌.. పెట్రోల్‌ బాంబుల దాడులు గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు? ప్రజలు నమ్మారు.. గెలిపించారు హోదా పక్కన.. ప్రజాస్వామ్యమే ముందు డిమాండ్ ఫుల్.. ధర నిల్ అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్ వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు తిరుపతి లడ్డూ కేసు.. ఇతర రాష్ట్రాలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో