05/11/2026, Thursday · 01:21:23 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 1:06 PM హైదరాబాద్ 1

అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : ఖానామెట్‌లోని అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అందుకోసం రేవంత్ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నామన్నారు. అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొని ఎవరూ నష్టపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ అయ్యప్ప సొసైటీలో రిజిస్ట్రేషన్లు ఉండవని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ సొసైటీలో 750 అక్రమ నిర్మాణాలు జరిగాయని వివరించారు. గురువారం హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. అయ్యప్ప సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సొసైటీలోనే నారాయణ, చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. సర్వే నెంబర్ 11/18 నుంచి 11/44 వరకు అక్రమ నిర్మాణాలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు దగ్గరుండి పర్మిషన్లు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ భూములు, టీడీఆర్ అక్రమ దందాలు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమి కనిపించటం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఈ దందా ఆపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. గురుకుల ట్రస్ట్ భూములపై అనేక ఉద్యమాలు చేశామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి.. రాజకీయాలు తప్ప ఏం మాట్లాడలేదని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తే.. అమిత్ షా హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారని వివరించారు. బీఆర్ఎస్‌ పార్టీపై మాట్లాడటం పని కొచ్చే అంశం కాదని టీఆర్ఎస్ చీఫ్ కవిత అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Revanth GovtSurveyAyyappaSocietyPoetryDeadlinefor

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

765 Posts

Latest News