05/11/2026, Thursday · 12:23:19 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. 1,300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్!

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 12:10 PM జాతీయం 1

ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. 1,300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్!
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు.. అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడంతో గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను నమోదు చేశాయి. గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9:16 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,367.69 పాయింట్లు (1.77 శాతం) పెరిగి 78,669.09 వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 379.25 పాయింట్లు (1.58 శాతం) లాభపడి 24,339.85 వద్ద ట్రేడయింది. మార్కెట్ ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించడంతో ప్రధాన సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు.. ముడి చమురు ధరలు 8 శాతానికి పైగా పడిపోవడం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారాయి.ముఖ్యంగా అమెరికా రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరల తగ్గుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్‌కు దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌లో ఉత్సాహాన్ని పెంచాయి. ముఖ్యంగా.. మార్కెట్ ర్యాలీలో ఆటో షేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆటోమొబైల్‌ రంగ సూచీ 2.5 శాతం మేర జంప్‌ చేసింది. నిఫ్టీలో మారుతి సుజుకీతో పాటు ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Sensex risesStockmarketsjoshpoints

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

762 Posts

Latest News