05/11/2026, Thursday · 12:23:20 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సింగరేణి కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.1.10 లక్షల దీపావళి బోనస్

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 11:37 AM జాతీయం 1

సింగరేణి కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.1.10 లక్షల దీపావళి బోనస్
Want this news as a newspaper clip?Print News Clip

ఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇవాళ (గురువారం) ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1,10,250 పీఎల్‌ఆర్‌(PLR) బోనస్ చెల్లించనుంది. కోల్ ఇండియా సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశంలో బోనస్ చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థల పనితీరును పరిగణనలోకి తీసుకుని పీఎల్‌ఆర్ బోనస్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు లాభాల వాటా కింద సగటున ఒక్కొక్కరికి రూ.1,53,912 చెల్లింపులు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా PLR బోనస్‌తో కార్మికులకు పండుగ వేళ మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఇంధన భద్రతకు సింగరేణి కార్మికులు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. బొగ్గు రంగ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, భద్రత, ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్రం సహకారం కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Diwali bonusCentreSingareniworkerslakh

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

762 Posts

Latest News