05/11/2026, Thursday · 02:17:36 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

డిమాండ్ ఫుల్.. ధర నిల్

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 1:30 PM మంచిర్యాల 1

డిమాండ్ ఫుల్.. ధర నిల్
Want this news as a newspaper clip?Print News Clip
  • నిజామాబాద్‌లో సన్నరకం పచ్చిధాన్యం క్వింటాలుకు రూ.4వేలు, మంచిర్యాలలో రూ.2,500లోపే
  • జిల్లా రైతులకు నిరాశ

హాజీపూర్‌(మంచిర్యాల): సన్నాల సాగుతో మంచి ఆదాయం వస్తుందని ఆశించిన జిల్లా రైతులకు నిరాశే మిగులుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటచేతికి వచ్చే సమయంలో తెగుళ్ల రూపంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతుల అవసరాన్ని దళారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పెట్టు బడులు పెరిగి పంటకు గిట్టుబాటు ధర లభించక సన్నాల సాగు రైతులు బేజారవుతున్నారు.

90 శాతం సన్నాల సాగు..

మంచిర్యాల జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1.45లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఇందులో దాదాపు 90శాతం విస్తీర్ణంలో రైతులు సన్నరకం వరిని సాగుచేశారు. ప్రభుత్వ సన్నధాన్యానికి ప్రోత్సాహ కాలు అందిస్తుందన్న ఆశతో ఎక్కువమంది రైతులు సన్నాలవైపు మొగ్గు చూపారు. సన్నాలకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాళుకు రూ.2460 ప్రకటించింది. దానికి రూ.500 బోనస్‌ ఇస్తోంది. అయితే పంట చేతి కి వచ్చే సమయంలో పరిస్థితులు తారుమార వుతున్నాయి.

చివరి దశలో తెగుళ్ల దాడి..

వరిపంట చివరి దశకు చేరుకున్న సమయంలో తెగుళ్లు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. పంటను కాపాడుకునేందుకు పలుమార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టు బడి వ్యయం మరింత పెరిగింది. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు మందుల ఖర్చు అదనపుభారంగా మారింది.

ధరల్లో జిల్లాల మధ్య వ్యత్యాసం..

ధాన్యం ధరల విషయంలోను మం చిర్యాల రైతులకు నిరాశే ఎదురవుతోంది. గత నెల నిజామాబాద్‌ జిల్లాలో దళారులు రైతుల పొలా ల వద్దకే వెళ్లి సన్నరకం పచ్చి ధాన్యం క్వింటాలుకు రూ. 4వేల వరకు కొ నుగోలు చేసిన ట్లు సమాచారం. కానీ మంచి ర్యాల జిల్లాలో పచ్చి ధాన్యానికి క్విం టాళుకు రూ.2500లోపే ధర పలుకుతోంది. ఆరిన ధాన్యాన్ని సైతం రూ.2750కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒకేరకం ధాన్యానికి జిల్లా మధ్య ఇంతటి వ్యత్యాసం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.

దళారుల దయాదాక్షిణ్యాలపై రైతు..

పంటకోతలు ప్రారంభమైనా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కోసిన ధా న్యాన్ని నిల్వచేసుకునే సదు పాయం, ఆరబెట్టుకునే అవకాశం లేని రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు తక్కువధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకా లంలో ప్రారంభిస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం స్పందించేదెప్పుడు?

ఒక వైపు తెగుళ్ల బెడద, మరోవైపు పెట్టుబడి భా రం ఇంకో వైపు గిట్టుబాటు ధర లేకపోవడం ఇలా అన్నివైపులా రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారం భించాలని, సన్నధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Price NilDemand

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

773 Posts

Latest News

రాప్తాడు బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం: మంత్రి సత్యకుమార్ యాదవ్ సీసీ కెమెరాలు ఆఫ్‌.. పెట్రోల్‌ బాంబుల దాడులు గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు? ప్రజలు నమ్మారు.. గెలిపించారు హోదా పక్కన.. ప్రజాస్వామ్యమే ముందు అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్ వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు తిరుపతి లడ్డూ కేసు.. ఇతర రాష్ట్రాలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో