అభివృద్ధి ఆకాంక్ష మీ వంతు, నెరవేర్చడం మా వంతు

- అందరి అభిప్రాయాలతోనే పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు
- పుర ప్రజలకు పిలుపునిచ్చిన బీటెక్ రవి
పులివెందుల పట్టణ పరిధిలో అభివృద్ధి ఆకాంక్ష ప్రజలదైతే వాటిని నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వాన్నిదని, పుర పోరులో తూగుట్ల గీతా కుమారి విజయానికి సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ , లోకేష్ బాబు మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలన సాగిస్తున్నారని, వారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ పులివెందుల మున్సిపాలిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి బహుమతిగా ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం ద్వారా పులివెందుల
పట్టణ అభివృద్ధి సాధ్యమని, అస్తవ్యస్త విధానాలకు స్వస్తి పలికి భావితరాల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా వారి ఆలోచనల మేరకే అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి ఆచరణలోకి తీసుకువస్తామని పులివెందుల పుర ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇచ్చి తమ అభివృద్ధి ఆకాంక్షను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












