05/11/2026, Thursday · 08:58:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పులివెందుల మునుపటిలా లేదు. మార్పు వచ్చింది: ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 12:30 PM వైఎస్సార్ కడప 19

పులివెందుల మునుపటిలా లేదు. మార్పు వచ్చింది: ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి
Want this news as a newspaper clip?Print News Clip
  • రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. జగన్ సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని అసత్యప్రచారాలకు పాల్పడుతున్నారని కడప జిల్లాలోని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆరోపించారు. పులివెందులలో టీడీపీ నేతలు గలాటా చేస్తున్నారనే తప్పుడు ప్రచారంపై ఘాటుగా స్పందించారు.

పులివెందుల మునుపటిలా లేదు. మార్పు వచ్చింది. అక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదు. పులివెందులకు వెళ్లి గలాటా చేసే వాళ్లు ఎవరూ లేరు.. సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని జగనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందులలో జగన్ మార్క్ మళ్లీ ప్రారంభమైంది. తాను చేసిన పాపాలను ఎదుటివారిపై నెట్టడం – ఇదే జగన్ 2.0 మార్క్. సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ నేతలు గలాటా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పులివెందులకు వెళ్లి గలాటా చేసే వాళ్లు ఎవరూ లేరు. పులివెందులలో మార్పు వచ్చింది. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. అవినాష్ రెడ్డి అబద్ధాలు చెప్పడం ఆపేస్తే మంచిది. బాబాయ్ హత్య కేసులో ఏమి జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు’ అంటూ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య కౌంటర్ ఇచ్చారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Chaitanya ReddyPulivendulausedMLAKrishna

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News