05/11/2026, Thursday · 08:58:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటన.. హైకోర్టుకు న్యాయవాదులు..

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 3:49 PM వైఎస్సార్ కడప 13

రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటన.. హైకోర్టుకు న్యాయవాదులు..
Want this news as a newspaper clip?Print News Clip

అనంతపురం: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై దాడి చేసిన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ పలువురు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. అయితే, పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది.ఈ సందర్భంగా న్యాయవాదులు పిటిషన్‌లో కీలక విషయాలను ప్రస్తావించారు. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, సీసీటీవీ రికార్డులు, వైద్య నివేదికలను భద్రపరచాలని కోరారు. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిశీలించాలని విన్నవించారు. హేమంత్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, బాధితుడి వాంగ్మూలం, వీడియో రికార్డింగ్‌ను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో పాటు మరో తొమ్మిది మందిని ప్రతివాదులుగా చేర్చారు.

కాగా, గత శనివారం పదో తరగతి బాలికపై హేమంత్ దాడికి పాల్పడ్డాడు. పాఠశాలలోకి చొరబడి చైన్‌సాతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తల, ముఖం, మెడ సహా శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో బాలిక కూడా గాయపడింది. అనంతరం హేమంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తుండగా, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హేమంత్ రాళ్లతో దాడి చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హేమంత్ రెండు కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అనంతరం నిందితుడిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

haikortuku nyayavaduluraptadunimditudipaikalpulaghatana

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News