05/11/2026, Thursday · 08:58:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జగన్ రాజకీయ సమాధికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధం: ఎమ్మెల్యే ఆదినారాయణ

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 12:27 PM వైఎస్సార్ కడప 19

జగన్ రాజకీయ సమాధికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధం: ఎమ్మెల్యే ఆదినారాయణ
Want this news as a newspaper clip?Print News Clip

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమాధికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పులివెందులతో సహా అన్ని చోట్లా ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ కుట్రలు, డ్రామాల టైమ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజాస్వామ్యం గెలవబోతోందని తెలిపారు. జమ్మలమడుగుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తాను పులివెందుల్లో గూండాయిజం చేయడం ఏమిటని వైసీపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.జగన్ అనుకూల మీడియాలో తన పేరు పదేపదే ప్రస్తావించడం సరైనా పద్దతి కాదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ నేరం తమపై నెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పులివెందుల్లో వాళ్లే గుండాయిజం చేసి ఆ తప్పు తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
11 సీబీఐ, 9 ఈడీ కేసుల్లో ఉన్న దొంగలే నీతి నిజాయితిల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేక భయంతోనే తమపై కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

MLA AdinarayanaStatepeoplereadyJaganpoliticalgrave

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News