పులివెందులలో పోలింగ్ ప్రారంభం కాక ముందే ఉద్రిక్తత.

- శిల్పారామం వద్ద 8 వాహనాలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు..
పులివెందుల శిల్పారామం వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పంటించారు. ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డికి చెందిన పొలంలోని నివాసం వద్ద నిలిపి ఉంచిన 11 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు, ఒక ట్రాక్టర్ ట్రాలీకి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే సుమారు ఎనిమిది వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












