05/11/2026, Thursday · 08:34:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సీతాఫలాల సీజన్‌ షురూ.. పాలకుర్తి మార్కెట్‌లో కిలో రూ.150

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 12:58 PM వరంగల్ 12

సీతాఫలాల సీజన్‌ షురూ.. పాలకుర్తి మార్కెట్‌లో కిలో రూ.150
Want this news as a newspaper clip?Print News Clip
  • మార్కెట్‌లో పండ్ల సందడి
  • పోషకాలు పుష్కలంగా ఉండడంతో కొనుగోలుకు ఆసక్తి
  • కిలో రూ.100 నుంచి రూ.150 ధర
  • పోషకాలు ఘనం.. సీతాఫలం

ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న సీతాఫలాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండడంతో వీటిని తినేందుకు జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్నారు. సీతాఫ లాల సీజన్‌ కావడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో పల్లెల నుంచి సీతాఫలాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కిలో రూ.100 నుంచి రూ.150 ధర పలుకుతోంది. అయినా కొనుగోలు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు.

సీతాఫలంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు అత్యధి కంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్‌-సీ,క్యాల్షియం, ఫాస్పరస్‌ పొటాషియం, మెగ్నిషీయం లాంటి ఖనిజ లవణాలు ఫలం సొంతం. సీతాఫలం తింటే ఎముకలు బలంగా ఉండడమేకాక, జీర్ణక్రియ వేగవంతానికి, మల బద్ధకానికి దివ్యఔషదంగా పని చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ ఫలాలు సీజన్‌ ఇప్పుడే ప్రారంభమైంది. ధరలు కూడా అంతే దూరంలో ఉందకుండా పోతున్నాయి. సూర్యాపేట, జనగామ, మహ బూబాబాద్‌ పట్టణాల నుంచి తీసుకువచ్చి పాలకుర్తి వారంతపు సంతలోనూ, పాలకుర్తి రాజీవ్‌ చౌరస్తాలో నాలుగు రోడ్ల కూడలిలో ఈ పండ్ల విక్రయాలు జరుపుతున్నారు. కిలో సీతా ఫలాలు రూ.100, రూ.150 ధర పలుకుతుంది. ఈ పండ్లలో రకాలు చిన్నవి, పెద్దవిగా ఉన్నా యి. పెద్దవి ఐదు పండ్లకు రూ. 150 పలుకుతు న్నాయి. చిన్నవి ఒక్క పండుకు రూ.20 పలుకు తోంది. ధరలు ఎక్కువగా పలుకుతున్న ప్పటికి కొనుగోలు మాత్రం తప్పడం లేదు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

fruit seasonSeedpalakartimarket

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News