05/11/2026, Thursday · 08:34:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నర్సీపట్నంలో తోటికోడళ్ల సమరం!

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 11:59 AM అనకాపల్లి 8

నర్సీపట్నంలో తోటికోడళ్ల సమరం!
Want this news as a newspaper clip?Print News Clip
  • మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బరిలో అయ్యన్న సతీమణి పద్మావతి
  • వైసీపీ తరఫున ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడి భార్య అనిత

 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా తోటికోడళ్లు తలపడుతున్నారు. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో కూటమి అభ్యర్థిగా ఆయన సతీమణి పద్మావతి, వైసీపీ తరఫున ఆయన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు సతీమణి అనిత పోటీ చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గతంలో రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా పనిచేశారు.

ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన భార్య పద్మావతి తొలిసారిగా 2021లో నర్సీపట్నం 25వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీచేసి గెలుపొందారు. చిన్న కుమారుడు రాజేశ్‌ 24వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. నాడు అధికారంలో ఉన్న వైసీపీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకుంది. అయితే కౌన్సిల్‌ సమావేశాల్లో సమస్యలపై పాలక వర్గాన్ని నిలదీసిన పద్మావతి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విజయవంతమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ పదవికి ఆమె పోటీ చేస్తున్నారు.

తొలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా అనిత

సన్యాసిపాత్రుడు భార్య అనిత 2004 నుంచి 2006 వరకు నర్సీపట్నం పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. 2011లో నర్సీపట్నం, బలిఘట్టం, పెదబొడ్డేపల్లి పంచాయతీలను కలిపి తృతీయ శ్రేణి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. టీడీపీ అభ్యర్థులుగా 24వ వార్డు నుంచి సన్యాసిపాత్రుడు, 25వ వార్డు నుంచి అనిత విజయం సాధించారు. టీడీపీ అత్యధిక స్థానాలు గెలుపొందడంతో అనిత చైర్‌పర్సన్‌గా, సన్యాసిపాత్రుడు వైస్‌ చైర్మన్‌గా పదవులు చేపట్టారు.

ఆ తరువాత కాలంలో అయ్యన్నపాత్రుడు, సన్యాసిపాత్రుడు మధ్య విభేదాలు వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరారు. 2021లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికలకు ఆయన కుటుంబం దూరంగా ఉంది. 2021లో అనితను డీసీసీబీ చైర్‌పర్సన్‌ పదవి వరించింది. 2023 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు. తాజాగా మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. తోటికోడళ్ల పోటీ నర్సీపట్నంలో రసవత్తరంగా మారింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Narsipatnambattleclassmates

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News