శ్రీవారి ఆలయంలో 495 ఏళ్ల నాటి శాసనం

- అచ్యుతదేవరాయల కాలం నాటిదిగా గుర్తింపు
తిరుమల శ్రీవారి ఆలయంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు అచ్యుతదేవరాయల కాలంనాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. సుమారు 495 ఏళ్ల నాటి ఈ శాసనాన్ని భారత పురావస్తుశాఖ(ఏఎస్‌ఐ) అధికారులు ఇటీవల అచ్చు తీశారు. ఆలయంలోని మూడో ప్రాకారం గోడపై ఈ శాసనం ఉన్నట్టు ఏఎ్‌సఐ ఎపిగ్రఫీ విభాగ డైరెక్టర్ కె.మునిరత్నంరెడ్డి వెల్లడించారు. క్రీ.శ 1531 ఫిబ్రవరి 13 నాటి ఈ శాసనం తమిళ భాషలో ఉంది. శక సంవత్సరం 1462 శార్వరి నామ సంవత్సరం కుంభ మాసం, బహుళ తదియ, ఆదివారంనాటి వివరాలున్నాయి. తిరుమలలో నివసించే ఏకాంగి శ్రీవైష్ణవుల్లో ఒకరైన పేరరుళాళయ్యన్ దానధర్మ వ్యవహారాన్ని ఈ శాసనం వివరిస్తోంది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












