05/11/2026, Thursday · 04:24:33 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలపై కేంద్రం హామీ.. తుమ్మలకు ప్రల్హాద్ జోషి లేఖ

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 4:16 PM హైదరాబాద్ 1

ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలపై కేంద్రం హామీ.. తుమ్మలకు ప్రల్హాద్ జోషి లేఖ
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి లేఖ రాశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలపై తెలంగాణ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని గతంలో మంత్రి తుమ్మల కోరిన విషయం తెలిసిందే. గతంలో 44 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రస్తుతం 11 శాతానికి తగ్గింది. దిగుమతి సుంకం తగ్గింపుతో దేశీయ ఆయిల్ పామ్ రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, చౌక దిగుమతులతో దేశీయ రైతులకు గిట్టుబాటు ధర దక్కదని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులకు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తులు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి.. మంత్రి తుమ్మలకు లేఖ రాశారు. దేశీయ వంటనూనెల అవసరాల్లో 56 శాతం దిగుమతులపైనే భారత్ ఆధారపడుతోందని తెలిపారు. రైతులు, పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సుంకాల సమీక్ష చేస్తామన్నారు. దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

pralhad joshiayilpamdigumatisumkalapaikemdramhamitummalaku

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

787 Posts

Latest News

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం.. 40 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్.. కర్నూలు జిల్లా కడిమెట్లలో ఆసక్తికర పోరు కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వేధింపులు.. మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా మైక్రోసాఫ్ట్, గూగుల్ తరువాత మెటా.. ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఎస్ఎస్ఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల ‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్.. గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సందడి.. గాంధీభవన్‌లో సమావేశానికి దామోదర డుమ్మా.. వెనుదిరిగిన మహేశ్ గౌడ్