తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే: అమిత్ షా

- తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందేనని, ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందేనని, ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన.. సాయంత్రం బషీర్‌బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకు నిర్వహించిన మహా పాదయాత్రలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం, పార్టీ అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












