05/11/2026, Thursday · 08:58:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హైదరాబాద్‌లో నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 2:18 PM హైదరాబాద్ 5

హైదరాబాద్‌లో నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి
Want this news as a newspaper clip?Print News Clip

 హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో పాండు బస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్లు నిండిన బకెట్‌లో పడి ఏడాదిన్నర చిన్నారి రాణి దేవి మృతిచెందింది. బిహార్‌కు చెందిన పప్పు రవిదాస్ (45) కూలీ పనులు చేస్తూ పాండు బస్తీలో నివాసం ఉంటున్నాడు. చిన్నారి తల్లి బిహార్‌లో ఉండటంతో, తండ్రి వద్దే ఉంటున్న చిన్నారిని మరో కుమార్తె చాందిని కుమారి (10) చూసుకుంటోంది.గురువారం ఉదయం కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం సుమారు 4 గంటలకు వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చి, బకెట్‌లో పడిన చిన్నారిని చూసి తన అక్క చాందిని కేకలు వేసింది. చిన్నారని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సూరారం పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Child diesfallingbucketofwaterHyderabad

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News