05/11/2026, Thursday · 10:52:01 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

1,741 మందికి ఇందిరమ్మ ఇళ్లు

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 10:38 AM హైదరాబాద్ 1

1,741 మందికి ఇందిరమ్మ ఇళ్లు
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్‌ సిటీ: ఇందిరమ్మ ఇళ్ల టవర్ల పైలట్‌ ప్రాజెక్టులో ఎంపికై వెయిటింగ్‌ లిస్టులో ఉన్న 1,741 మందికి ఈ-లాటరీలో బుధవారం ఇళ్లను కేటాయించారు. క్యూర్‌ ప్రాంతంలోని అల్పాదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో 480 ఇళ్లను నిర్మిస్తున్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ ద్వారా ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది.క్షేత్రస్థాయిలో పరిశీలనలో అనర్హులుగా తేలడం, కొంతమంది తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేటాయింపును రద్దు చేసుకోవడం వంటి కారణాలతో 14 నియోజకవర్గాల పరిధిలో 1,741 ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. నాంపల్లి హౌసింగ్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాప్‌-అప్‌ ఈ లాటరీలో ఆ ఇళ్లను వెయిటింగ్‌ లిస్టులో ఉన్న వారికి కేటాయించారు. లాటరీ ప్రక్రియలో హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ విపి గౌతం, కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఖైరతాబాద్‌లో 327..

ఈ లాటరీ ప్రక్రియలో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 327 మంది, మహేశ్వరం నియోజకవర్గంలో 201 మంది ఇళ్లను పొందారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 80, మల్కాజిగిరిలో 150, కూకట్‌పల్లిలో 59, సనత్‌నగర్‌లో 88, కంటోన్మెంట్‌లో 66, బహదూర్‌పురాలో 91, కార్వాన్‌లో 73, మేడ్చల్‌లో 143, నాంపల్లిలో 106, మలక్‌పేటలో 171, రాజేంద్రనగర్‌లో 133, అంబర్‌పేటలో 53 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఏర్పడిన ఖాళీలకు అదనంగా మరో 875 మందిని వెయిటింగ్‌ లిస్టు కోసం ఈ-లాటరీ ద్వారా ఎంపిక చేశారు. లాటరీలో ఎంపికైన వారి వివరాలు నిర్ధారించుకునేందుకు త్వరలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Indiramma housepeople

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

751 Posts

Latest News

చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్ రేషన్‌ బియ్యానికి పాలిష్‌ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్ శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం.. మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలి పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలి: సీఎం చంద్రబాబు బాలుడి దత్తత కేసులో మరల ట్విస్ట్ - జిల్లా కలెక్టర్ హైకోర్టులో రిట్ పిటిషన్ పోలీసులతో ఎంపీ అవినాష్ రెడ్డి వాగ్వాదం.. పార్నపల్లిలో హైటెన్షన్