05/11/2026, Thursday · 10:55:32 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రేషన్‌ బియ్యానికి పాలిష్‌

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 10:44 AM రంగారెడ్డి 1

రేషన్‌ బియ్యానికి పాలిష్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • మంచాలలో రాఘవేంద్ర రైస్‌మిల్లులో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సోదాలు
  • 150 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
  • లైసెన్స్‌, జీఎస్టీ అనుమతులు లేకుండానే రైస్‌మిల్‌ నిర్వహణ
  • వివిధ రకాల బ్రాండ్ల పేరిట బస్తాల్లో ప్యాకింగ్‌

మంచాల/ఆదిభట్ల(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా మంచాలలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సోదాల్లో 150 క్వింటాళ్ల పీడీఎస్‌ రేషన్‌ బియ్యం పట్టుబడింది. ఎస్పీ రాంకుమార్‌, డీఎస్పీ వెంకట్‌రెడ్డిల నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం మంచాలలోని రాఘవేంద్ర రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మిల్లు యాజమాన్యం రేషన్‌బియ్యాన్ని బ్రాండెడ్‌ బియ్యంగా మారుస్తూ బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు వారు గుర్తించారు.రైస్‌మిల్లులో పాలి్‌షచేసి వివిధ బ్రాండ్లలో ప్యాకింగ్‌ చేసిన 50 క్వింటాళ్ల రేషన్‌బియ్యం, సమీపంలోని గోదాములో నిల్వ ఉంచిన మరో 100 క్వింటాళ్లకు పైగా రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఎస్‌పీ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు రాఘవేంధ్ర రైస్‌మిల్లులో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో పాలిష్‌ చేసిన పీడీఎస్‌ బియ్యం మిక్స్‌చేసి 20 రకాల లేబుల్‌ బ్రాండ్లు కలిగిన బస్తాల్లో నింపి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించామని తెలిపారు.ఇంకా రైస్‌మిల్‌ ఎదురుగా ఉన్న గోదాములో అక్రమంగా నిల్వఉంచిన 100 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రైస్‌మిల్లు యాజమాన్యం ఎలాంటి లైసెన్స్‌, జీఎస్టీ, ట్యాక్సుల నిర్వహణ లేకుండా అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని వివరించారు. విచారణ జరిపి రైస్‌మిల్‌ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోదాల్లో డీఎస్వో వనజాత, సుధాకర్‌, మంచాల సీఐ మధు తదితరులు పాల్గొన్నారు.

పోచారం రైస్‌మిల్లులపై..

ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో గణేష్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ రైస్‌ మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు బుధవారం అకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలో రైస్‌ మిల్లులో నిర్వహించే తూకం మిషన్‌కి లైసెన్స్‌ లేకపోవడం 20 కిలోల మిషన్‌, 50 కిలోల మిషన్‌ లేకపోవడం, రైస్‌మిల్లు ఆవరణలోని వేబ్రిడ్జీలో ఉండాల్సిన బాట్లు లేకపోవడంతో లీగల్‌ మెట్రాలజీ అధికారులు రైస్‌ మిల్లుపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో డిప్యూటీ తహాసీల్డార్‌ రామకృష్ణ, లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, విజిలెన్స్‌ సీఐ పాండారి, మహేష్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ration ricePolish

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

752 Posts

Latest News

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..11 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మొత్తం – 2,72 చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్ 1,741 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్ శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం.. మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలి పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలి: సీఎం చంద్రబాబు బాలుడి దత్తత కేసులో మరల ట్విస్ట్ - జిల్లా కలెక్టర్ హైకోర్టులో రిట్ పిటిషన్