05/11/2026, Thursday · 08:58:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేక నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 3:09 PM హైదరాబాద్ 7

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేక నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క
Want this news as a newspaper clip?Print News Clip
  • నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా..
  • ప్రజలతోనే ఉండాలనేది నా సిద్ధాంతం...

మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని తెలంగాణ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మహిళల రాజకీయ ఎదుగుదలలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఆయా సమస్యలకు భయపడకుండా వాటిని అధిగమించి వనితలు ఉన్నత స్థానాల్లోకి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రైవేట్ హోటల్‌లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు.. మహిళా రాజకీయ నాయకత్వం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రెటరీ గురుదీప్ సింగ్ సత్పాల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కోటా నిలిమ , పెద్ద ఎత్తున మహిళ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు.

నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా..

‘నా చిన్నతనంలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఆకలి బాధలు ఎదుర్కొన్నాను.. అయినప్పటికీ అన్ని కష్టాలను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. ములుగు ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పెద్దల అండదండలతో అతిపెద్ద శాఖ అయిన పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కాగలిగాను.నాకు ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు. అపర వనరులు ఉన్న ప్రాంతం ములుగు. అలాంటి ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో నేను జన్మించాను. చిన్నతనంలో అన్యాయాలను చూడలేక నక్సలైట్ అయ్యాను. నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు.. కానీ నక్సలైట్ అయ్యాను. ఆ తర్వాత లాయర్, ఎమ్మెల్యే, మంత్రి అవుతానని ఎన్నడూ ఊహించలేదని.. కానీ కష్టాన్ని నమ్ముకొని పనిచేశాను. నేడు మంత్రిగా మీ ముందు ఉన్నాను’ అని మంత్రి సీతక్క తెలిపారు.

ప్రజలతోనే ఉండాలనేది నా సిద్ధాంతం...

‘నేను మంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడు నా మూలాలు మరిచిపోలేదు. ప్రజా జీవితమంటే ప్రజలతోనే ఉండాల్సిందే. ఇప్పటికీ ప్రతివారం రెండు రోజులు నేను నా ములుగు ప్రజల మధ్యనే ఉంటాను. ప్రజలు ఎన్నుకున్నారని.. ప్రజలతోనే ఉండాలనేది నా సిద్ధాంతం. ఎమ్మెల్యే, మంత్రి కాగానే ప్రజలతో దూరంగా ఉండాలని.. అప్పుడే గౌరవం కలుగుతుందని కొందరు భావిస్తారని.. కానీ నేను ఆ బావనకు పూర్తి విరుద్ధం. మనం ప్రజలకు జవాబుదారులం.. మనం బాసులం కాదని.. మనం సేవకులం. నాయకులకు ప్రజలే బలం. అయితే మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగిన వివక్షతను ఎదుర్కొంటున్నారు. పురుష మంత్రులకు ఇచ్చినంత గౌరవం మహిళా మంత్రులకు ఇవ్వరు. పురుష మంత్రులను గౌరవించినట్లుగా.. మహిళా మంత్రులను గౌరవించరు. ఆయనప్పటికీ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. డెడికేషన్, డిటర్మినేషన్‌తో పనిచేస్తూ పోవాలి. నా జీవితం కష్టాల కలపోత, పోరాటాలమయం. నా కష్టాలను. పోరాటాలను ఎప్పటికీ మర్చిపోను’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.



ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Minister SeethakkaNaxalitesirinjusticeschildhood

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News