05/11/2026, Thursday · 08:33:17 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

శాంతిభద్రతలను కాపాడేందుకు ఎస్ఐ ఎన్. చంటిబాబు ఎన్నికల అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 10:29 PM కృష్ణా 6

శాంతిభద్రతలను కాపాడేందుకు ఎస్ఐ ఎన్. చంటిబాబు ఎన్నికల అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
Want this news as a newspaper clip?Print News Clip
  • కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్. చంటిబాబు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు - 2026 నేపథ్యంలో మోటూరు ఎక్స్ రోడ్డు వద్ద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.

ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు పాల్పడటం వల్ల గ్రామంలో మరియు కుటుంబాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. ఎన్నికల పోటీల విషయంలో ఒకరితో ఒకరు గొడవలకు దిగకుండా, గెలుపోటములను ప్రజాస్వామ్య నిర్ణయంగా గౌరవించాలని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు.
అలాగే గొడవలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గుడివాడ రూరల్ పోలీసులు కోరారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Chandibabu hassetmaintainlaworderelectionawarenessbanner

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News