05/11/2026, Thursday · 08:34:50 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నీట్ పీజీ రూల్స్ ఎందుకు భిన్నంగా ఉన్నాయి?.. వివరణ ఇవ్వాలని ఎన్‌బీఈఎంఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 4:50 PM జాతీయం 15

నీట్ పీజీ రూల్స్ ఎందుకు భిన్నంగా ఉన్నాయి?.. వివరణ ఇవ్వాలని ఎన్‌బీఈఎంఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: నీట్-పీజీ పరీక్షల ఆన్సర్ కీస్, ప్రశ్నపత్రాల వెల్లడి విషయంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర పోటీ పరీక్షలకు భిన్నంగా నీట్-పీజీ నిబంధనలు ఎందుకు ఉన్నాయో లిఖితపూర్వకంగా వివరించాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన బెంచ్ ఆదేశించింది. ప్రశ్నల నిధి పరిమితమని, వాటిని వెల్లడిస్తే భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందన్న బోర్డు వాదనపై కోర్టు పలు ప్రశ్నలు అడిగింది. ఎన్‌బీఈఎంఎస్ దాచిపెడుతున్న నీట్-పీజీ పాత ప్రశ్నపత్రాలు ఇప్పటికే అమెజాన్‌లో లభిస్తున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.జవాబు పత్రాల దాపరికంపై సుప్రీంకోర్టు జోక్యంతో లక్షలాది మంది పీజీ అభ్యర్థుల్లో ఉత్కంఠ. పారదర్శకతను పక్కనపెట్టి కేవలం ప్రశ్నల కొరత పేరుతో జవాబు పత్రాలు ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నీట్-పీజీ పిటిషన్లపై తదుపరి విచారణ కోసం ఎన్‌బీఈఎంఎస్ ఇచ్చే రాతపూర్వక సమాధానమే కీలకం కానుంది. కాగా.. బోర్డు క్వశ్చన్ ఐడీ నంబర్లను మాత్రమే ఇస్తోందని, పరీక్షలో వేర్వేరు అభ్యర్థులకు ప్రశ్నల క్రమం మారుతుందని విద్యార్థులు తెలిపారు. అసలు ప్రశ్నలు, ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల తాము రాసిన సమాధానాలను స్వయంగా సరిచూసుకోవడం అసాధ్యంగా మారిందని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా ఎన్‌బీఈఎంఎస్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ivvalani enbiiemeskunitpijirulsemdukubhinnamgaunnayivivarana

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News