05/11/2026, Thursday · 08:03:02 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. వైసీపీ ఎంపీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 12:02 PM జాతీయం 10

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. వైసీపీ ఎంపీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Want this news as a newspaper clip?Print News Clip

ఢిల్లీ : ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏపీ డీజీపీ, కమిషనర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చి విచారించాలంటూ వైసీపీ ఎంపీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే సాయికృష్ణ కేసును ఇప్పటికే సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

pitishannu kottesinasayikrushnalakapdetkesuvaisipiempi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News