05/11/2026, Thursday · 08:35:02 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 8:09 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 10

కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
Want this news as a newspaper clip?Print News Clip
  • కేంద్రం నుంచి వచ్చే నిధులు అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తుందంటూ వైసీపీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.
  • వైసీపీ.. క్రిమినల్ లిటిగెంట్ పార్టీగా మారిపోయిందని విమర్శించారు.

వైసీపీ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనమైందని తెలిపారు. బుధవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని అన్నారు. ఈ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం అలవాటుగా పెట్టుకున్నారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు.సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ వైసీపీ సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కూటమి నేతలపై వైసీపీ దాడులు చేస్తూ వారే కోర్టును తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రిమినల్ లిటిగెంట్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన సూచించారు. నెల్లూరు రూరల్‌లోని 36 స్థానాల్లో 8 ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మరో 9 స్థానాల్లో వైసీపీ ప్రధాన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారని చెప్పారు.

డమ్మీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారని పేర్కొన్నారు. 17 స్థానాల్లో వైసీపీ పోటీ లేనట్లే అయిందని అన్నారు. నెల్లూరు రూరల్‌లో జెన్‌జీలకు అవకాశం ఇస్తానని తాను ముందే చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భీమినేని వేదశ్రీ 44 డివిజన్ నుంచి అవకాశం ఇచ్చామని.. ఆమె ఎన్నిక ఏకగ్రీవమైందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

MLA KotamreddyYCPconspiraciesblockcentralfunds

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News