05/11/2026, Thursday · 08:33:14 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విద్యార్థినులపై దాడి చేసిన వ్యక్తిని వదిలిపెట్టం.. పరిటాల సునీత హెచ్చరిక

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 3:55 PM శ్రీ సత్యసాయి 14

విద్యార్థినులపై దాడి చేసిన వ్యక్తిని వదిలిపెట్టం.. పరిటాల సునీత హెచ్చరిక
Want this news as a newspaper clip?Print News Clip

జిల్లాలో విద్యార్థినులపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థినులను ఆమె ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దాడిలో గాయపడిన విద్యార్థినుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. విద్యార్థినులపై దాడి చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా స్పందించారని పరిటాల సునీత తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారని.. బాధిత విద్యార్థినులకు అండగా ఉండాలని ఆదేశించారని వెల్లడించారు. విద్యార్థినులపై దాడికి పాల్పడి ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

sunitha cautionLeavingattackerbehindparitala

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News