జిల్లాలో సుగంధ, ఔషధ మొక్కల పెంపునకు పెద్దపీట

- 1,500 హెక్టార్లలో మెడిసినల్ & అరోమాటిక్ ప్లాంట్స్ సాగు లక్ష్యం
- రెండు రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
శ్రీసత్యసాయి జిల్లాలో అరోమాటిక్ మరియు మెడిసినల్ ప్లాంట్స్ (సుగంధ, ఔషధ మొక్కలు) సాగును విస్తృతంగా పెంచేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ సీఈవో చంద్రశేఖర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు.భారత ప్రభుత్వం సహాయ సహకారాలతో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 1300 నుండి 1500 హెక్టార్లలో మొక్కలు పెంపకం చేపట్టాలని నిర్ణయించారు.
విభాగాల వారీగా కేటాయించిన లక్ష్యాలు:
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ : 200 హెక్టార్లు
సోషల్ ఫారెస్ట్రీ: 200 హెక్టార్లు
హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ : 200 హెక్టార్లు
అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్: 200 హెక్టార్లు
సెరికల్చర్ డిపార్ట్‌మెంట్: 50 హెక్టార్లు
డ్వామా: 600 హెక్టార్లు
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
ఆసక్తిగల రైతులను మరియు అనువైన భూములను వెంటనే గుర్తించాలి. ఫారెస్ట్ ఏరియాలకు ఆనుకుని ఉన్న భూములను ఈ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కేటాయించిన టార్గెట్‌కు సంబంధించి రెండు రోజుల్లోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎఫ్‌వో చక్రపాణి, సోషల్ ఫారెస్ట్రీ డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ అధికారి జయకుమార్, వ్యవసాయం డిఎఓ కృష్ణయ్య,డ్వామా పీడీ విజయ ప్రసాద్, సెరికల్చర్ జెడి శోభా రాణి,అధికారులు మరియు మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు సీఈవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













