పి.అరుణ్ బాబు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ధర్మవరం బి.ఎస్.ఆర్ ఉన్నత పాఠశాల నందు మునిసిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల పరిశీలకులు పి.అరుణ్ బాబు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని బి.ఎస్.ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు (ఎలక్షన్ అబ్సర్వర్) పి.అరుణ్ బాబు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, కౌంటింగ్ టేబుళ్ల అమరిక మరియు అభ్యర్థుల/ఏజెంట్ల ప్రాంగణాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని కౌంటింగ్ సిబ్బందికి ఆదేశించారు.
లెక్కింపు కేంద్రంలో పాల్గొనే కౌంటింగ్ ఏజెంట్లు, అధికారులు, మీడియా ప్రతినిధులకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, సమాచార కేంద్రం వంటి సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ బలమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య,ధర్మవరం తహశీల్దార్ దేవరాజు,మున్సిపల్ అధికారులు, మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












