05/11/2026, Thursday · 08:34:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 8:56 PM వైఎస్సార్ కడప 21

మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Want this news as a newspaper clip?Print News Clip
  • మూడంచెల భద్రతా వ్యవస్థ..కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా
  • జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ వెల్లడి

3 న మంగళవారం జరగనున్న మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కౌంటింగ్ కు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్.పి గారు పత్రికా ప్రకటన లో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద DFMD (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్) లతో తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా, ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణా సంచా కాల్చడం నిషేధించడం జరిగిందన్నారు. గెలిచిన అభ్యర్థులు, ఓటమి చెందిన అభ్యర్థులు సంయమనం పాటించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించిన ఏజెంట్లు, అభ్యర్థులు మాత్రమే పంపించడం జరుగుతుందన్నారు.కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లు, అభ్యర్ధులు(క్యాండిడేట్స్) ఎన్నికల నియమావళి ఆదేశాలను పాటించాలన్నారు.
 కౌంటింగ్ జరిగే రోజు జిల్లాలో ఎక్కడా మద్యం విక్రయించకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 కౌంటింగ్ కేంద్రాల వద్ద 30 పోలీసు Act , సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున ఎవరూ గుంపులుగా ఉండకూడదని హెచ్చరించారు. ఏటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.
 ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
• ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం గాని, కవ్వింపు చర్యలకు గాని పాల్పడరాదన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

security arrangementsTightmunicipalelectioncounting

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News