ఓటు వేసి నేరుగా ఇంటికి వెళ్లాలి’.. జగన్‌కు డీఐజీ సూచన

నగరంలోని ఆర్ట్స్ కాలేజ్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పులివెందుల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చన్నారు. ఓటు వేసిన తర్వాత జగన్.. నేరుగా ఇంటికి వెళ్లాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా పులివెందుల పట్టణంలో తిరిగేందుకు ఆయనకు అనుమతి లేదన్నారు. పులివెందులలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా పులివెందుల, జమ్మలమడుగు, కడపలో అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది పోలీసు బలగాలను మోహరించినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.కాగా.. పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎన్నికల రోజు తాను పులివెందులలోనూ ఉంటానని, ఎవరొస్తారో చూసుకుంటానంటూ మాస్ వార్నింగ్ ఇవ్వడం రాజకీయంగా రచ్చకు దారి తీసింది. అయితే జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












