05/11/2026, Thursday · 08:34:17 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తాడిపత్రిలో ఫ్యాక్షన్ లేకుండా చేస్తా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 2:15 PM అనంతపురము 11

తాడిపత్రిలో ఫ్యాక్షన్ లేకుండా చేస్తా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Want this news as a newspaper clip?Print News Clip
  • తాడిపత్రికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్..
  • స్థానిక ఎన్నికలంటే భయం లేదు..

 అభివృద్ధి అంటే ప్రభుత్వం ఇచ్చే నిధులతో కాదని.. సొంత ఆలోచనలతో నిధులు తేవడాన్ని అభివృద్ధి అంటారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి (JC Prabhakar Reddy) పేర్కొన్నారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి తన సొంత ఆలోచనలతో నిధులు తెచ్చి రూపురేఖలు మార్చనని చెప్పుకొచ్చారు. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని మండలాల జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రం వద్దకు ప్రభాకరరెడ్డి వచ్చారు. జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి జిల్లా పరిషత్‌లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.

తాడిపత్రికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్..

అనంతపురం జిల్లా పరిషత్‌ను అభివృద్ధి చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే తాడిపత్రికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్ వస్తోందని అన్నారు. దేశంలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ఈ లైసెన్స్ సెంటర్స్ ఉన్నాయని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ యల్లనూరు జెడ్పీటీసీగా ఎంటెక్ చదివే అమ్మాయిని పోటీలో పెడుతున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన పర్వాలేదని, తాడిపత్రిలో ఫ్యాక్షన్ లేకుండా చేస్తానని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికలంటే భయం లేదు..

స్థానిక ఎన్నికలంటే తనకు భయం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో తన కొడుకు, తాను పోటీచేశా, తన అన్న కూడా గతంలో పనిచేశారని.. అందుకే భయం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో తాను, కేతిరెడ్డి పెద్దారెడ్డి రాళ్లు వేసుకుంటుంటే.. జనం తమ ఇద్దరి మీద రాళ్లు వేస్తారని చమత్కరించారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. 2028లో రాజకీయ నాయకులను మెట్టు(చెప్పు)తో కొడుతారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Key CommentsfacttadipatriPrabhakarReddy

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News