ఎక్కడున్నావ్ ప్రకాష్.. వేట ప్రారంభించిన మూడు బృందాలు

- ఒకటి కేరళం.. మరో రెండు ఉత్తర భారతదేశానికి..
- ఒకటి కేరళం.. మరో రెండు ఉత్తర భారతదేశానికి..
అనంతపురం: పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈమేరకు పలు రాష్ట్రాల్లో పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రాప్తాడు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ నెల 25న పోలీసులను కించపరుస్తూ, పరుష పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. ‘తోపుదుర్తి’ వైఖరిని జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను జిల్లా పోలీస్ శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఆయన గతంలో కూడా పలు మార్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. తోపుదుర్తికి చెందిన ఓ యువకుడి హత్య కేసులో ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజాను అరెస్టు చేసినప్పుడు కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. పదేపదే పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా ఎన్నికల వేళ ఆయన మరోసారి దారుణంగా పోలీసులను దూషించాడు. రెచ్చగొట్టేలా మాట్లాడటంతో ఆయనపై కేసు పెట్టి, అరెస్టు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












