బెళుగుప్పలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీ

- జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహణ
- పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన క్యాండిల్ ర్యాలీ
- అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పాల్గొన్న పోలీసులు, విద్యార్థులు, గ్రామస్థులు
ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి బెళుగుప్ప మండల కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్ప ఎస్ఐ శివ నేతృత్వంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ శివ మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల ప్రాణరక్షణకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి సూచనల మేరకు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాల్లో భాగంగా పలు అవగాహన, సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు చట్టానికి కట్టుబడి పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













